ప్రకాశం జిల్లాలో హత్యలో వివరాలు

ప్రకాశం జిల్లాలో హత్యలో  వివరాలు

ప్రకాశం: జిల్లా బేస్తవారిపేట మండలం పీవీపురంలో భార్యను భర్త హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఉదయం భార్యాభర్తలు పొలానికి వెళ్ళారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త పొలంలో కత్తితో భార్య గొంతుకోసి చంపి పరారయ్యాడు. కాగా, భార్యను హత్య చేసిన విషయం సాయంత్రం తమ్ముడికి ఫోన్ చేసి తెలిపాడు. అనంతరం పొలానికి చేరుకున్న తమ్ముడు మృతి చెందిన వదినను చూసి పోలీసులకు చెప్పాడు.