సీఎం రాకకై ఎదురుచూస్తున్న నూతన దవాఖాన
SRD: పటాన్ చెరువులో 300 కోట్ల రూపాయల (CSR) నిధులతో నిర్మితమైన అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ దవాఖానను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలిసింది. కాలుష్య సమస్యలపై పలు పోరాటాలు చేసి, సుప్రీంకోర్టు వరకు వెళ్లి, రూ. 567 కోట్ల నిధులు రప్పించడంలో కీలక పాత్ర పోషించిన డా. కిషన్ రావు పేరును నూతన దవాఖానకు పెట్టాలని ప్రాంత ప్రజలు కోరుతున్నారు.