'చిరు వ్యాపారులకు స్వనిధి రుణాలు ఇప్పించాలి'
KMM: ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద చిరు వ్యాపారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని 44వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు విజయ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు విన్నవించారు. మంగళవారం కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆకుకూరలు అమ్ముకునే వారి కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించాలని కోరారు.