జిల్లాలో కార్టెన్ సెర్చ్ ఆపరేషన్
PPM: రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా పార్వతీపురం, పాలకొండలో శనివారం కార్టెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ తనిఖీల్లో సబ్ డివిజన్ అధికారులు పాల్గొన్నారు.