మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా రామకృష్ణ ఎంపిక

కోనసీమ: అయినవిల్లి మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా డివివి రామకృష్ణను మండల పరిషత్ అధికారులు బుధవారం ఎంపిక చేశారు. రామకృష్ణ ఎంపీ యూపీ స్కూల్‌లో ఎలకలంక ఎస్జీటీగా పనిచేస్తున్నారు. రామకృష్ణను గురుపూజోత్సవం సందర్భంగా మండల పరిషత్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సన్మానిస్తున్నట్టు తెలిపారు. రామకృష్ణను పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.