అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
MDCL: ఘట్‌కేసర్ పోలీస్టేషన్ పరిధిలో ఆత్మారామ్ వర్మ అనే ఛత్తీస్‌ఘఢ్ వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. గత సంవత్సరం బతుకుదెరువు కోసం ఘట్‌కేసర్‌కు వచ్చి డైరీ ఫామ్‌లో లేబర్‌గా పనిచేస్తున్న ఇతను, అప్పుల భారం ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది వేపచెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు.