మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా తీజ్ వేడుకలు

మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా తీజ్ వేడుకలు

NLG: దేవరకొండలోని ప్రభుత్వ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు, బంజారా లంబాడీ సంస్కృత సంప్రదాయానికి చాటి చెప్పే తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో 9 రోజులు అత్యంత వైభవంగా జరుపుకున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ హరిప్రియ శుక్రవారం తెలిపారు. 9 రోజులపాటు మొలకలను నీరు పోసి పెంచి సాంప్రదాయ పద్ధతిలో నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేసినట్లు చెప్పారు.