ఆస్పత్రి పనులను పరిశీలించిన మంత్రి
NRPT: మక్తల్ పట్టణంలో నిర్మించనున్న 150 పడకల ఆస్పత్రి పనులను ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నవంబర్‌లోగా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైవే రోడ్డు నుంచి ఆసుపత్రికి వచ్చే రహదారి స్థలాన్ని కూడా పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా విశాలమైన రోడ్డు ఉండాలని సూచించారు.