క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే
E.G: అమలాపురం బాలయోగి స్టేడియం వేదికగా జరిగిన SAAP LEAGUE-2026 రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రాజమండ్రికి చెందిన దంపతులు తమ అద్భుత ప్రతిభతో విజేతలుగా నిలిచారు. రాజీ, విజయ్ జంట క్రీడా మైదానంలో ఆడి ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. ఈ మేరకు వారు ఇవాళ రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని MLA అభినందించారు.