'అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి'
PDPL: రామగుండం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన, టీయూ ఐడీఎఫ్ నిధులను సమర్థవంతంగా వినియోగించి పనులు సకాలంలో, నాణ్యతతో ముగించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ పాల్గొన్నారు.