వీరవాసరంలో ఉపాధ్యాయుల నిరసన

వీరవాసరంలో ఉపాధ్యాయుల నిరసన

W.G: వీరవాసరం జెడ్‌పీ హైస్కూల్ వద్ద FAPTO ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కొత్త పీఆర్‌సీ కమిషన్ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఛైర్మన్ విజయరామరాజు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ రంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఈ నిరసనలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.