ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు
JGL: జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాలకు ఇవాళ భారీగా భక్తులు తరలి వచ్చారు. ఫాల్గుణ శుద్ధ దశమి శనివారం సందర్భంగా ఈ ఆలయాల్లో అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు.