18మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

18మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

కాకినాడ: జిల్లాలోని పల్లంరాజు నగర్‌లో ఒక అపార్ట్మెంట్‌లో పేకాట ఆడుతున్న స్థావరంపై 3 టౌన్ పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో 18 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.