గంజాయి సేవిస్తున్న 11 మంది అరెస్ట్
GNTR: నగరంలో గంజాయి విక్రయం, సేవించడంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో లాలాపేటలో కొందరు గంజాయి సేవిస్తున్నారన్నా పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి, స్టేషన్‌కు తరలించి, కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు.