జిల్లాలో తొలి సర్పంచ్ ఏకగ్రీవం !
SDPT: పంచాయతీ ఎన్నికల నామినేషన్ తొలిరోజే జగదేవ్‌పూర్ మండలం, బిజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. చెక్కల పరమేశ్వర్ పోటీ లేకుండానే సర్పంచ్ ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి పరమేశ్వర్ నాయకత్వమే సరైనదని నమ్మిన గ్రామస్థులు, ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.