చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే దంపతులు
PLD: పల్నాడు ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మాచర్లలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన సతీమణి శోభారాణితో కలిసి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.