లక్ష్మాపూర్ సర్పంచ్‌కు తొలి నామినేషన్ దాఖలు
MDK: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామ పంచాయతీకి మొట్టమొదటి నామినేషన్ దాఖలైంది. ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్లు స్వీకరిస్తుండగా.. సర్పంచ్ అభ్యర్థిగా పత్తి ప్రవీణ్ తన పత్రాలను అధికారులకు అందజేశారు. తొలి నామినేషన్ దాఖలు కావడంతో మండలంలో ఎన్నికల వాతావరణం మొదలైంది.