మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. ఇంట్లోకి పాములు
RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ 11వ వార్డు పద్మశాలి కాలనీలో చెత్తాచెదారం, శిథిలాలు తొలగించకపోవడంతో పాముల భయం పెరిగింది. పాత గోడలు కూల్చిన మట్టి అలాగే ఉండటంతో పాములు ఇళ్లలోకి వస్తున్నాయని కౌన్సిలర్ పిల్లి శారదాశేఖర్ ఆరోపించారు. పలుమార్లు విన్నవించినా చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.