ఘనంగా భక్త కనకదాసు జయంతి వేడుకలు
VZM: జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో భక్త కనకదాస జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. భక్త కనకదాసు జీవితం, ఆయన ఆధ్యాత్మికత, సమాజసేవా భావాన్ని అధికారులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, వసతి గృహ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.