‘బీహార్‌లో గెలిచాం.. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్’
బీహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. బీహార్‌లో అభివృద్ధి బాధ్యతను ప్రధాని మోదీ తీసుకున్నారని, ఇది రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని అన్నారు. అభివృద్ధిపై ప్రజలకు మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. 'బీహార్ ఎన్నికల్లో గెలిచాం, ఇక పశ్చిమ బెంగాల్‌లో గెలవడమే మిగిలివుంది' అంటూ త్వరలో జరగబోయే బెంగాల్ ఎన్నికలను టార్గెట్ చేశారు.