విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి
ప్రకాశం: పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు(M) కొణిజేడులో శుక్రవారం జరిగిన మేఘ పేరెంట్స్ డేలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను పొందాలన్నారు. ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో యోగా సాధన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు.