ప్రారంభంమైన బీజేపీ శోభాయాత్ర

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బీజేపీ శోభాయాత్ర ప్రారంభమైంది. ముందుగా ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారికి నివాళులు అర్పించి ఈ యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రారంభించారు. ఈ యాత్ర గడియార స్తంభం మీదుగా కొనసాగనుంది. అనంతరం మాధవ్ జిల్లా నాయకులతో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఈ యాత్రకు జిల్లా నలుమూలల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.