రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీకి ఓటు వేయండి

తూర్పుగోదావరి: రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. యువతకు ఉపాధి అవకాశాలు కావాలన్నా.. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని జగ్గంపేట ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కోడలు జ్యోతుల లక్ష్మీదేవి అన్నారు. జ్యోతుల నెహ్రూకు మద్దతుగా ఇటకాలపల్లి గ్రామపంచాయతీలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఓటు వేసి ఎమ్మెల్యేగా జ్యోతులు నెహ్రూను గెలిపించాలని కోరారు.