చెట్ల కొమ్మల కింద విద్యుత్ తీగలు

చెట్ల కొమ్మల కింద విద్యుత్ తీగలు

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీలోని గాంధీనగర్ కాలనీలో విద్యుత్ తీగలపైకి చెట్ల కొమ్మలు ఏపుగా పెరిగిపోయాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని వాపోతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ తీగలపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.