రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గేటు సమీపాన వెంకటాద్రి వంటిల్లు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు తిరిగే సమయంలో ఎలక్ట్రికల్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న భార్యాభర్తలు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.