'గిరిజన దర్బార్ వినియోగించుకోండి'

'గిరిజన దర్బార్ వినియోగించుకోండి'

BHPL: జిల్లాలోని కొత్తగూడ రైతు వేదికలో ఈ నెల 20న గిరిజన దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఏటూరునాగారం ప్రాజెక్టు అధికారి చిత్రామిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు, గార్ల, బయ్యారం మండలాల గిరిజనులు గిరిజన దర్బార్‌కు హాజరై తమ ఫిర్యాదులు సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.