'దాబా(కే) సర్పంచ్‌గా సామకబాయి విజయం'
ADB: ఇచ్చోడ మండలంలోని దాబా(కే) గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా గురువారం ముగిసాయి. గ్రామ సర్పంచ్‌గా సామకబాయి సమీప ప్రత్యర్థి అభ్యర్థి లలితపై 169 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 8 వార్డ్ మెంబర్లకు గాను 5ఏకగ్రీవం అవ్వగా మిగతా మూడు వార్డ్ మెంబర్ల ఫలితాలు సైతం విడుదలైనట్లు పేర్కొన్నారు.