మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్పీ
KRNL: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ట్రాఫిక్ నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు.