సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన సీఐ
KDP: పులివెందులలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల పాఠశాలలో గురువారం సీఐ సీతారామిరెడ్డి విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలను బాధ్యతగా ఉపయోగించకపోతే కలిగే నష్టాలు, ప్రమాదాల గురించి ఆయన వివరించారు. ఆన్‌లైన్‌లో అపరిచితులపై నమ్మకం పెట్టుకోవద్దని పేర్కొన్నారు.