మొక్కజొన్న డబ్బులు చెల్లించాలని రైతుల డిమాండ్
NZB: మొక్కజొన్న డబ్బులను వెంటనే చెల్లించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆర్మూర్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మొక్కజొన్న మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఇప్పటికే సుమారు నెలరోజులు గడిచిపోయినా రైతుల ఖాతాల్లో మొక్కజొన్న డబ్బులు వేయకపోవడం విచారకరమన్నారు.