ఉప్పుటేరులో పెరుగుతున్న నీటిమట్టం

W.G: ఉప్పుటేరులో భారీ వర్షాలకు నీటి మట్టం పెరుగుతోంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరు ద్వారా వరద నీరు సముద్రంలోకి చేరుతుంది. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు ద్వారా వరద నీరు కొల్లేరులోకి చేరి అనంతరం సముద్రంలో కలుస్తోంది. ఉప్పుటేరులో నీటిమట్టం పెరిగితే దుంపగడప, సిద్దాపురం, ఆకివీడు వరద బారిన పడే ప్రమాదం ఉంది.