ALERT: ఉప్పల్ స్టేడియంలోకి ఇవి నో ఎంట్రీ
TG: ఉప్పల్ స్టేడియంలో మ్యాచులకు వచ్చే ప్రేక్షకులకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్టేడియంలోకి పలు వస్తువులపై నిషేధం విధిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. సెల్ఫీ స్టిక్స్, ఇయర్ ఫోన్ బడ్స్, పవర్ బ్యాంకులు, ఛార్జర్లకు అనుమతి లేదన్నారు. క్రికెట్ అభిమానులు పోలీసులకు సహకరించి, ఈ నిషేధిత వస్తువులను తెచ్చుకోవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.