'రాజ్యాంగ స్ఫూర్తితోనే అందరికీ సమాన అవకాశాలు'
BHNG: భారతదేశంలో ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగం గొప్పతనమే అని భువనగిరి మాజీ మున్సిపల్ ఛైర్మన్ బర్రె జహంగీర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.