నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: జామి మండలంలో కుమరాం 33 KV సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైను మెయింటినెన్స్, చెట్లు కొమ్మల తొలగింపు కారణంగా ఆదివారం ఉదయం 8 నుంచి10 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని EE. సురేశ్ బాబు శనివారం తెలిపారు. ఈ మేరకు కుమరాం, బలరాంపురం, M కొత్తవలస, అన్నమరాజుపేట గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.