నేటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన

నేటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన

కడప: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. సా.4 గంటలకు పులివెందుల చేరుకుని క్యాంపు ఆఫీసులో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు. మరుసటి రోజు బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడుతారు. ఈ మేరకు స్థానిక నాయకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.