రాయదుర్గం మున్సిపాలిటీకి కొత్త వాహనాలు
ATP: రాయదుర్గం మున్సిపాలిటీకి కొత్తగా మంజూరైన రెండు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను ప్రభుత్వ విప్, రాయదుర్గం MLA కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. పారిశుద్ధ్య పనులను మరింత సమర్థంగా నిర్వహించడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.