ధర్మవరంలో పార్వతీ పరమేశ్వరుల పల్లకి సేవ

ధర్మవరంలో పార్వతీ పరమేశ్వరుల పల్లకి సేవ

SS: ధర్మవరంలోని చెరువుకట్ట శివాలయంలో సోమవారం ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ ద్వారకానాథ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం సందర్భంగా కాశీ విశాలాక్షి సహిత కాశీ విశ్వనాథ శ్రీ పార్వతీ పరమేశ్వరులకు ఉయ్యాలోత్సవం, పల్లకి సేవ చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.