తిరుపతి జూలో బెంగాల్ టైగర్ మృతి

తిరుపతి జూలో బెంగాల్ టైగర్ మృతి

TPT: తిరుపతి శ్రీవేంకటేశ్వర జూ పార్కులో 'అనంత' అనే ఆడ బెంగాల్ టైగర్ బుధవారం మృతిచెందింది. కొంతకాలంగా అది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. జూ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించారు. కోలుకోలేక పులి చనిపోయింది. జూ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనారోగ్యంతోనే మృతిచెందినట్లు నిర్ధారించారు.