'క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి'

ADB: విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని ఇంటర్మీడియట్ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం తాంసీ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించి అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఉదయ్ భాస్కర్, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.