VIDEO: కాళోజీ బొమ్మతో విద్యార్థుల అభిమాన వ్యక్తీకరణ

VIDEO: కాళోజీ బొమ్మతో విద్యార్థుల అభిమాన వ్యక్తీకరణ

KNR: ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి కేజీబీవీలో మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి) వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోర్డుపై కాళోజీ చిత్రాన్ని గీయడంతో ఆయన పట్ల అభిమానాన్ని వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ లావణ్య మాట్లాడుతూ.. కలం కత్తి కంటే పదునైనదని, కాళోజీ స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.