రేవంత్ రెడ్డి పర్యటనను నిలిపివేయాలి: కవిత

రేవంత్ రెడ్డి పర్యటనను నిలిపివేయాలి: కవిత

TG: సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కొనసాగుతున్న క్రమంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటనపై 'జాగృతి' అధ్యక్షురాలు కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'సీఎం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన పర్యటనలు ఎన్నికల ప్రచారమే. ఇందుకోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ స్పందించి ఈ పర్యటనను నిలిపివేయాలి' అని అన్నారు.