ఈ బైక్ మీ దగ్గర ఉందా.. GOOD NEWS

ఈ బైక్ మీ దగ్గర ఉందా.. GOOD NEWS

KTM తన బైక్‌లపై 4 ఏళ్ల స్టాండర్డ్ వారంటీని ప్రకటించింది. 2025 మోడళ్ల నుంచి వర్తించే ఈ ప్రోగ్రామ్‌లో బజాజ్ తయారు చేసే 400cc లోపు బైక్‌లు కూడా ఉన్నాయి. డర్ట్, ట్రాక్ బైకులకు ఇది వర్తించదు. బైక్ అమ్మినా వారంటీ కొత్త యజమానికి బదిలీ అవుతుంది. గతంలో ఉన్న 2 ఏళ్ల వారంటీని ఇప్పుడు రెట్టింపు చేస్తూ వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.