కోవా బన్ వ్యాపారికి మంత్రి మద్దతు
KRNL: కోవా బన్ వ్యాపారి పట్ల జరిగిన అమానవీయ ఘటనపై Xలో మంత్రి అచ్చెన్నాయుడు వీడియో షేర్ చేశారు. 'ఆకలికి కులం ఉండదు, ఆత్మగౌరవానికి మతం ఉండదు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన వ్యక్తులే. SMలో వ్యూస్, లైక్స్ కోసం ఒక చిరు వ్యాపారిని రోడ్డుపైకి లాగడం దారుణం. ఆ వ్యాపారికి అండగా నిలుస్తున్న నెటిజన్లకు ధన్యవాదాలు' తెలిపారు.