నేల కూలిన సైనిక రవాణా విమానం

నేల కూలిన సైనిక రవాణా విమానం

టర్కీ సైనిక విమానానికి ప్రమాదం జరిగింది. అజర్ బైజాన్ నుంచి టర్కీకి వెళ్తున్న సమయంలో జార్జియా సరిహద్దు ప్రాంతంలో టర్కీ సైనిక కార్గో విమానం ఒక్కసారిగా నేల కూలింది. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనేది మాత్రం తెలియరాలేదు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.