VIDEO: 'మహదేవపూర్‌లో గ్రామస్థులు ధర్నా'
BHPL: మహాదేవపూర్ మండలంలో ఇసుక క్వారీ రోడ్డుపై ఆదివారం గ్రామస్థులు ధర్నా చేపట్టారు. ఇసుక లారీలకు పట్టాలు కప్పే ఉపాధి అవకాశాల్లో వివక్ష చూపుతున్నారని, కేవలం కొందరికే ప్రాధాన్యత ఇచ్చి మిగతా వారి జీవనోపాధిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం విభేదాలు సృష్టిస్తున్నారని, అర్హులైన అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు