'అన్ని వర్గాలకు సమన్యాయం చేశారు'

కడప: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని ముద్దనూరు వైసీపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. సమాజంలోని అంటరానితన్నాన్ని నిర్మూలించేందుకు అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారన్నారు.