'అర్జీదారులను కలిసి మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలి'
VZM: పీజీఆర్ఎస్ ద్వారా అందిన వినతులను అర్జీదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ సమీక్షలో ఆయన మాట్లాడారు. అర్జీదారునితో మాట్లాడిన తేదీ, సమయం వివరాలను రిపోర్టులో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.