VIDEO: వాడపల్లి వెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
కోనసీమ: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌస్ మీరా మొయినుద్దీన్‌తో పాటు జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లు వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం వారికి స్వామి వారి చిత్రపటం అందజేశారు.