పలాసలో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిరీష

పలాసలో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిరీష

SKLM: పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధి 20 వార్డ్ శివాజీ నగర్ కాలనీలో రూ. 5.5 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ హయాంలో పలాసను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు టిడిపి నేతలు పాల్గొన్నారు.