రేపే బ్యాడ్మింటన్ పోటీల ఎంపిక..!

రేపే బ్యాడ్మింటన్ పోటీల ఎంపిక..!

KDP: జిల్లా పరిధిలో ఈనెల 24న బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్, సీనియర్ జట్ల ఎంపికకు పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి వెంకటరమణ తెలిపారు.